విద్యుత్ సౌధను ముట్టడించిన భాజపా
హైదరాబాద్:విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని భాజపా విద్యుత్‌సౌధను ముట్టడించింది. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, సర్‌ఛార్జీలను ఎత్తివేయాలని నేతలు డిమాండ్ చేశారు. గ్రామాల్లో అప్రకటిత కోతలు ఎత్తివేయాలని కోరారు.