విద్యుత్ ఉద్యోగులు బోజన విరామ సమయములో నిరసన కార్యక్రమం
గద్వాల నడిగడ్డ మార్చి 4 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డివిజనల్ కార్యాలయం ముందు శనివారము విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పి ఆర్ సి అమలులో నిర్లక్ష్యానికి ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 8 నుండి విద్యుత్ సర్కిల్ కార్యాలయం ముందు నిరవధిక రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ అశోక్ , శ్రీధర్,నర్సింహ, వెంకట్ రాములు, శాలన్న, మురళి, శ్రీయుక్త,విమలా, నగేష్, పరమెష్,సతీష్, పరశురాముడు,భాస్కర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Related