విద్యుత్ ఏఈ రాంబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి

భైంసా రూరల్ నవంబర్ 28జనం సాక్షినిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళలపై దౌర్జన్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడిన విద్యుత్ ఏఈ రాంబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం వేళలో ఇంట్లో ఎవరు లేని సమయంలో వచ్చి విద్యుత్ బకాయిలు కట్టలేదని సరఫరా నిలిపివేసినా మహిళలు ఏమి అనలేదు. అనంతరం గ్రామపంచాయతీ బోరు మోటారుకు చెందిన విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంతో తమకు నీటి ఎద్దడి తలెత్తుతుందని అధికారికి చెప్పినా వినకుండా మహిళలని చూడకుండా ఏఈ దుర్భశలాడాడని అన్నారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ కు చెప్పి పునరుద్ధరించుకుంటామని మహిళలు చెప్పగా మీ సర్పంచ్ ఒక పెద్ద దొంగ మీకు కూడా దొంగతనం నేర్పుతున్నాడా అని సర్పంచ్ ని సైతం తిట్టినట్లు మహిళలు పేర్కొన్నారు. ఏఈ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని లేనియెడల తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.