విద్యుదాఘాతంలో తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి, కొడుకు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. మాడుగుల మండలం అర్కపల్లి గ్రామంలో నియోజక వర్గ యువజన కాంగ్రెస్‌ నేత వెంకటయ్య ( 25) సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి తీస్తుండగా తెగి ఉన్న విద్యుత్‌ వైర్లు అతనికకి తాకి విద్యుత్‌ షాక్‌ గురయ్యాడు. దాన్ని గమనించిన అతని తల్లి కొడుకును రక్షించబోయి తాను విద్యుత్‌షాక్‌కు గురై మరణించింది.