విధులను బహిష్కరించిన తెలంగాణ లాయర్లు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ లాయర్లపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ హైకోర్టు , నాపంల్లి కోర్టులలో లాయర్లు విధులను బహిష్కరించారు. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న హైకోర్టు న్యాయవాదులను ప్రాసిక్యూట్ చేయాలని జారీ చేసిన జోవో 2348ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.