విధ్వంసం పేరిట తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని కాంగ్రెస్‌ కుట్ర: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కవాతులో విధ్వంసం జరగాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. విధ్వంసం పేరిట తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందన్నారు. తెలంగాణ కవాతు వాయిదా కోరుతూనే కాంగ్రెస్‌ నేతలు అణచివేతకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.