వినతి పత్రం అందజేత

 

దండేపల్లి. జనంసాక్షి. మార్చి16 తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం దండేపల్లి మండలంలోని ఐకెపి కార్యాలయంలో ఏపీఎం బ్రాహ్మయ్యకు వివో ఏలు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వివో ఏ లను రెగ్యులర్ చేస్తూ కనీస వేతనం 18 వేలకు పెంచుతానని హామీ ఇచ్చి ఇప్పటివరకు వివో లను పట్టించుకోవడం లేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర వివోఏల సంఘం పిలుపుమేరకు ఈనెల 16 17 18 మూడు రోజుల సమ్మె కొనసాగిస్తామని వినతి పత్రం అందజేశారు తమ డిమాండ్ కనీస వేతనం 18 వేల తో పాటు పదిలక్షల జీవిత బీమా( ఇన్సూరెన్స్)5లక్షల వరకు హెల్త్ కార్డు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివో ఏ ల సంఘం అధ్యక్షురాలు బొలిశెట్టి అనంతలక్ష్మి పద్మ ఆడే భూలక్ష్మి మల్లేష్ శ్రీనివాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు