వినాయక చవితి సందర్భంగా పట్టణంలో అన్నదాన కార్యక్రమం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని పదో వార్డులో వినాయక చవితి సందర్భంగా మహాఅన్నదాన కార్యక్రమం స్థానిక కౌన్సిలర్ గుండా ఫణికుమారిరాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. గురువారం ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కే ఎల్ ఎన్ రెడ్డి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, పట్టణ సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు లు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో వార్డులో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని, ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డ్ కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్, రెండోవార్డ్ కౌన్సిలర్ జక్కుల సంబయ్య, ఐదవ వార్డ్ కౌన్సిలర్ దొంగరి మంగమ్మ, రాంరెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రామ్ గోపి, ఎనిమిదవవార్డ్ కౌన్సిలర్ సౌజన్య ధనుంజయ్, 21వ వార్డు కౌన్సిలర్ గాయత్రి భాస్కర్, 22వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్, 24వ వార్డు కౌన్సిలర్ గుంజ భవాని విజయ్, 27వ వార్డు కౌన్సిలర్ ఎరగాని గురవయ్య, 28 వ వార్డు కౌన్సిలర్ అమరవది గంగరాజు, పట్టణ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సోమపొoగు రవీందర్, కంచర్ల మధు, రామిశెట్టి రాము, కోల్లపూడి చంటి, పంగ నరసింహారావు, రాజేష్, కమిటీ సభ్యులు దేవరం పురుషోత్తం రెడ్డి, దేవరం శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, రామ్ రెడ్డి, పుల్లారెడ్డి, కంచర్ల బాబుల్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.