విమాన సిబ్బంది తీరుపై ఫిర్యాదు
హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో.. ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది తనను చెంప దెబ్బ కొట్టినట్లు ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సీ ఆరోపించింది. అయితే ఎయిర్ ఇండియా మాత్రం ఆ ఘటనను ఖండించింది. ఈ ఘటన పట్ల ఎయిర్‌పోర్ట్ ఇన్స్‌పెక్టర్ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, కానీ ఆ రోజు ఫ్లయిట్ 9 గంటలు ఆలస్యంగా వెళ్లిందని, ఆ సమయంలో ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లానని, కానీ డెస్క్ వద్ద ఉన్న ఉద్యోగి తనతో సరిగా ప్రవర్తించలేదని డీజే ఓలీ ఫిర్యాదు చేసింది. డెస్క్ వద్ద ఉన్న లేడీ ఉద్యోగి దురుస్తుగా మాట్లాడి, తనను చెంప దెబ్బ కొట్టినట్లు ఆమె వీడియోలో పేర్కొన్నది. ఉద్యోగిని వీడియో తీస్తుండగా, వాళ్లు అడ్డుకున్నారని, అంతకుమించి అక్కడ ఏవిూ జరగలేదని ఎయిర్ ఇండియా ఈ ఘటనపై స్పందించింది. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కేసును విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.



