విలేకరులకు రక్షణ కల్పించాలి: జిల్లా ఈసీ మెంబర్ సంతోష్

 

 

 

 

 

ధర్మపురి 14 మార్చి (జనం సాక్షి) మెట్ పల్లి లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వేణు గోపాల్ రావు పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐ.జె.యూ) జిల్లా శాఖ పిలుపు మేరకు ధర్మపురి పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహాం ముందు మంగళవారం ఉదయం 11:00 గంటలకు జర్నలిస్టుల ధర్నా నిరసన కార్యక్రమం చెప్పట్టడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్నే సంతోష్ మాట్లాడుతూ,సమాజం లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్య లను నిర్భయంగా పేపర్ లో రాస్తున్న జర్నలిస్టులపై దాడి ని ఖండించాల్సిన అవసరం ప్రజలు, అన్ని రాజకీయ పార్టీ ల నాయకులపై ఉంది,వార్తలు రాస్తే దాడులకు దిగడం ఇదేం సంస్కృతి అని ఆవేదన వ్యక్తం చేశారు. రిపోర్టర్ దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేశారే తప్ప నిందితులను అరెస్ట్ చేయలేదని వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరి పై జరిగిన దాడిని ధర్మపురి ప్రెస్ క్లబ్ పక్షాన త్రీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.బాధిత విలేఖరి న్యాయం జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని, న్యాయ పొరటం చేయుటకు ధర్మపురి ప్రెస్ క్లబ్ కార్యాచరణ రూపొందిస్తోందని అన్నారు. విలేఖరిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో సంపత్, శంకర్, రవి, వెంకన్న, వాసు, రాజేందర్, సుధీర్, వినయ్, సాయి, స్వామి తదితరులు పాల్గొన్నారు.