వివిధ నేరాలకు పాల్పడి మంత్రులు జైలుకెళ్లడం ఏ దేశ చరిత్రలో లేదు: చంద్రబాబు

అనంతపురం: వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు సాయంత్రం కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన కోరిక అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా ఇళ్లు, నిరుద్యోగులకు రూ. వెయ్యి భృతి అందజేస్తామన్నారు. వివిధ నేరాలకు పాల్పడి మంత్రులు జైలుకెళ్లడం ఏ దేశ చరిత్రలోనూ లేదని చంద్రబాబు ఆరోపించారు. క్విట్‌ కాంగ్రెస్‌ ఉద్యమాన్ని చెపట్టి తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ పార్టీలను బంగాళాఖాతంలోకి నెట్టాలని పిలుపునిచ్చారు.