విశాఖలో 30కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం, మార్చి 18: జిల్లాలోని మాడుగుల మండలం, గరికబండ చెక్‌పోస్టు దగ్గర 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గరికబండ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపడుతుండగా ఆటోలో గంజాయి తరలిస్తుండడాన్ని పోలీసులు గమనించి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.