విశాఖలో 8 లక్షల అపహరణ

విశాఖపట్నం: నగరంలోని 69వ వార్డు శ్రీసాయి ఫౌండేషన్‌ నేత్ర వైద్యశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు 8లక్షలు ఈ చోరీకి పాల్పడ్డారు. పెందుర్తిలో పీఎన్‌ఎల్‌ కంపెనీలో కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మద్ది వసంతరావు పట్టణంలోని ఐపీఐసీఐ బ్యాంకునుంచి రూ. 8లక్షలను డ్రా చేసుకొని ఆసుపత్రిలో ఉన్న తల్లి రమణమ్మను చూసేందుకు కారును ఆసుపత్రి బయట ఆపి లోపలికి వెళ్లారు. ఇది ముందుగానే గమనించిన దుండగులు కారులోని బ్యాగును అపహరించారు. దీంతో బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.