విశాలాంధ్ర సభల పేరుతో విద్వేషాలు రేపొద్దు: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకోవడం లేదని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉందని తుది నిర్ణయమే తీసుకోవాల్సి ఉందన్నారు.  హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ ఒక వివాదాస్పద ప్రాంతంగా చూడటం లేదన్న వినోద్‌, హైదరాబాద్‌పై ప్రేమను పెంచుకోవద్దని సూచించారు. విశాలాంధ్ర సభల పేరుతో పరకాల ప్రభాకర్‌ సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలపై ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. సమైక్యంగా ఉండాలన్న అంశంపై వంద కారణాలు చూపుతామని చెబుతున్న పరకాల తన మేధస్సును ఆ ప్రాంత అభివృద్థిపై పెట్టాలన్నారు.