విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని

ఎల్బీ నగర్( జనం సాక్షి ) విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శనివారం నాడు బీఎన్రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్లోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం , గౌరవ అధ్యక్షులు తల్లోజు చెన్నయా చారి, కోశాధికారి ఆవంచ మురళిలు మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఆ ప్రభుత్వమే కర్నాటక జిల్లాల కేంద్రాల్లో, మండల కేంద్రాలలో అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు . తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు . తెలంగాణ ప్రభుత్వమే యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉప్పల్ భగాయత్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించాలని సూచించారు .