వి అర్ ఎ దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సి పీ ఐ నాయకులు

share on facebook

పినపాక నియోజకవర్గం ఆగస్టు 04 (జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా గత 11 రోజులుగా. వీఆర్ఏలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా మణుగూరులో తహాశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న దీక్షలకు సిపిఐ పట్టణ, మండల కార్యదర్శి దుర్గ్యాల, సుధాకర్ జంగమ్ మోహన్ రావు లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యోగ భద్రత, వీఆర్ఏలకు పేస్కేల అమలు చేయాలని అన్నారు. వారు చేస్తున్న ఆందోళన డిమాండ్స్ సరైనదేనని ప్రభుత్వం వీరిని అన్ని విధాలుగా ఉపయోగించుకొని నేడువారిని నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని వారు ఆరోపించారు . వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు సోందే కుటుంబరావు, మండల కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ, వార్డు నెంబర్ కనితి సత్యం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కంప రవి తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.