వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు లోక్‌సభకు బిల్లు
న్యూఢిల్లీ: వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు, వారి వ్యాపార క్యాకలపాలను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. బొగ్గు కేటాయింపుల కుంభకోణంపై ప్రతిపక్షం సభలో ఆందోళన చేస్తున్న సమయంలోనే కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రి కుమారి శెల్జా ఈ బిల్లును సభముందుంచారు. బిల్లులోని నిబంధనలననుసరించి వీధి వ్యాపారం నిర్వహించడలచిన 14 సంవత్సరాలు నిండిన ఎవరైన పట్టణ వ్యాపార సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకోవచ్చు సంఘం వారికి గుర్తింపుకార్డులు మంజూరు చేస్తుంది. రోడ్డు పక్కన కాలిబాటల మీద, రోడ్ల మీద వ్యాపారాలను అడ్డుకోవడానికి అధికారులకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది.