వీరన్నపేట సర్పంచ్ భిక్షపతికి గ్రామీణ సేవా రత్న పురస్కారం

తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేడుకలలో మండల పరిధిలోని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతిని రెండవసారి ఉత్తమ సర్పంచ్ గా, విశిష్ట గ్రామీణ సేవా రత్న పురస్కారం అందుకున్నారు. వారిని ఆదివారం శాలువాతో కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. విశిష్ట గ్రామీణ సేవా రత్న పురస్కారం, ఉత్తమ సర్పంచ్ గా ఎంపికకు కృషి చేసినందుకు గాను కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.