వృద్ధురాలిని నిర్భంధించి 20 తులాల బంగారం చోరీ

హైదరాబాద్‌: అరవయ్యేళ్ల వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే నిర్బంధించి ఒంటిమీద ఉన్న 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన పాతబస్తీలోని మొఘల్‌పురాలో చోటగుచేసుకుంది. సాలెహాబేగం అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి మీ కోడలు రమ్మందంటూ ఓ మహిళ ఇంట్లో ప్రవేశించింది. లోపల గడియపెట్టి, వృద్ధురాలి నోట్లో బట్టలు కుక్కి, ఆమె ఒంటిమీద ఉన్న బంగారమంతా దోచుకుని పరారైంది. ఈ దోపిడీలో ముగ్గురు వ్యక్తులు పాల్గొనివుంటారని పోలీసులు భావిస్తున్నరు.