వెయ్యి మంది కళాకారులకు అవకాశం కల్పించాలి….

– జనగామ జిల్లా కళాకారుల సంఘం….
జనగామ కలెక్టరేట్ ఆగస్టు 5(జనం సాక్షి): శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జనగామ జిల్లా కమిటీ అధ్యక్షులు ఊర సంపత్ ఆద్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్లో జనగామ జిల్లా కలెక్టర్ సి హెచ్ శివలింగయ్యను మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 8వ తేది నుండి 22 వ తేది వరకు జరిగే 75 వసంతల అజాది కా అమృత్ మహోత్సవంలో జనగామ జిల్లాలో ఉన్న వివిధ కళారూపాలకు సంబంధించిన వెయ్యి మంది కళాకారులకు అవకాశం కల్పించగలరని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి జీడికంటి శ్రీనివాస్, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు మారుపాక కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి కడారి ఐలన్న, పాలకుర్తి మండల అధ్యక్షులు గుగ్గిళ్ల కొమురయ్య, గూడూరు గ్రామ కమిటీ అధ్యక్షులు జోగు యాదయ్య, పంబాల రవి, కోలాటం మాస్టర్ శంకర్ రాజు, ఒగ్గు కళాకారులు దెయ్యాల కుమార్, గొరిగే రాములు, కోలాటం కళాకారులు గొరిగే శోభ, దాసరి నవ్య తదితరులు పాల్గొన్నారు.