వేధింపుల కారణంగా ఎస్పీని నిర్బంధించిన కానిస్టేబుల్‌

హైదరాబాద్‌: పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట ఎస్పీ లక్ష్మీనారాయణను శర్మ అనే కానిస్టేబుల్‌ గదిలో బంధించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. బిర్లామందిర్‌ వద్ద ఒ గదిలో ఎస్పీని బంధించినట్లు సమాచారం. అదనపు ఎస్పీ విజయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. శర్మ అనే కానిస్టేబుల్‌ తన సొంత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లోనే ఎస్పీని నిర్బంధించినట్లు తెలుస్తోంది. వెధింపుల కారణంగానే ఎస్పీని బంధించినట్లు అతను చెబుతున్నాడు. తలుపులు బద్దలు కొడితే ఎస్పీని తగలబెడతానని అతను హెచ్చరిస్తున్నట్లు సమాచారం.