వైఎస్సార్ సేవలు మరువ లేనివి

రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 13  వ వర్థంతి కార్యక్రమం మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక ఇందిరా చౌక్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ…. వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని వాటిలో 108,ఉచిత విద్యుత్తు,ప్రాజెక్ట్ ల రూప కల్పనలు చేసిన మహోన్నత వ్యక్తి,రైతులకు ఎన లేని సేవలనందించిన గొప్ప మహనీయుడని ఆయన చేసిన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చేలుకల తిరుపతి,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,పిడుగు రాజారెడ్డి, అట్టేపెళ్లి మల్లేశం, సుమంతు రాజారెడ్డి,పుట్కపు రాజారెడ్డి, ఎర్రం లింగారెడ్డి, బోయిని నడిపి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.