వైకాపా కార్యాలయం వద్ద న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్‌: వైఎస్‌ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో జరుపతులపెట్టిన చేనేత కార్మికుల ఒక రోజు దీక్షను రద్దు చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ విజ్ఞాప్తి చేసింది. లేదంటే ఆమె పర్యటనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి తెలంగాణ న్యాయవాదులు తరలివచ్చి విజయమ్మ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. కార్యాలంయలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెంలగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే ఆ పార్టీ తెలంగాణలో అడుగుపెట్టాలని కోరారు. విజయమ్మ పర్యటనను కొనసాగిస్తే అడ్డుకుని తీరుతామని న్యాయవాదుల జేఏసీ నేతలు హెచ్చరించారు.