వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.దుకాణాలు, విద్యాసంస్థలు పనిచూస్తున్నాయి. అంతకు ముందు దీక్షకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.