శంకరపట్నంలో భారాస ఆందోళన
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో
బండి సంజయ్ కు మతిభ్రమించింది
భారాస పార్టీ శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి
శంకరపట్నం: మార్చి 11( జనం సాక్షి)
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత పై బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. శనివారం కరీంనగర్, వరంగల్ రహదారిపై ధర్నా చేసి, బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సంజయ్ డౌన్ డౌన్, బిజెపి డౌన్ డౌన్, అంటూ ప్రధాన రహదారిపై నినాదాలు రాస్తారోకో చేస్తూ ఆందోళన చేపట్టారు. సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఈ సందర్భంగా జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఎంపీ హోదాలో ఉండి, సభ్య సమాజం తలదించుకునే విధంగా కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సబబు కాదని హితువు పలికారు. భాజపా లో బండి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. వెంటనే తన వ్యాఖ్యలను బే షరతుగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు