శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3 కేజీల బంగారం పట్టివేత

హైదరాబాద్‌, మార్చి 25: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టబడుతూనే ఉంది. తాజాగా బుధవారం ఉదయం కస్టమ్స్‌ అధికారులు 3 కేజీల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానంలో అధికారులు ఈ గోల్డ్‌ని కనుగొన్నారు. అయితే, బంగారాన్ని ఎవరు తీసుకొచ్చారో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు.