శరద్‌పవార్‌ను కలిసిన వైఎస్‌ విజయమ్మ

నూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. ఏపీలో రైతు సమస్యలను పరిష్కారించాలని పవార్‌ను ఆమె కోరారు. పవార్‌తో విజయమ్మ భేటీ అయిన సమయంలో మీడియాను లోపలికి అనుమతించలేదు. దీంతో పవార్‌ పీఏకు మీడియా ప్రతినిధులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ మీడియా ప్రతినిధిపై  పవార్‌ అడిషనల్‌ పీఏ చేయి చేసుకున్నారు. మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగడంతో పవార్‌ పరిస్థితిని చక్కదిద్దారు.