జేఈఈ పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల
న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్ సెషన్`1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్`1 పరీక్ష, 29న పేపర్ `2 పరీక్ష జరగనున్నాయి. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజుల అడ్మిట్ కార్డులను విడుదల చేయగా.. 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేయనున్నారు. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుÑ రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.


