శర్మతో డీజీపీ జరిపిన చర్చలు ఫలించాయి, ఎస్పీ విడుదల

హైదరాబాద్‌: హెడ్‌కానిస్టేబుల్‌ శర్మతో డీజీపీ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ విడుదలకు రంగం సిద్ధమైంది. హెడ్‌కానిస్టేబుల్‌ నిర్బంధం నుంచి ఎస్పీ లక్ష్మీనారాయణ విడుదలయ్యారు. డీజీపీ జరిపిన చర్చలు ఫలించడంతో ఎస్పీని తీసుకుని శర్మ బయటకు వచ్చాడు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్‌ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.