శాండీ తుపానుతో న్యూయార్క్‌ నగర వీధులన్నీ చీకటిమయం, జలమయం

న్యూయార్క్‌: శాండీ తుపానుతో న్యూయార్క్‌ నగర వీధులన్నీ జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలతో, రాళ్లగుట్టలతో వీధులన్ని నిండిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలంతా చీకట్లోనే గడువుతున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మరలా నీటి ప్రవాహం ఎక్కువైంది. నగరవీధుల్లో వరదనీరు ప్రవహిస్తోంది. ఎక్కుడా దీపాలు లేకపోవడంతో నగరమంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. గత రాత్రి వచ్చిన వరదనీటితో కార్ల పార్కింగ్‌లో నీరు చేరడంతో కార్లన్నీ నీటిపై తేలాడాయి. వరదలతో సబ్‌వేలను మూసివేశారు. వాల్‌స్ట్రీట్‌ వద్ద వరదనీటిని ఇంజన్లతో తోడుతున్నారు.