శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించండి: సీఎం

హైదరాబాద్‌: శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీని ఆదేశించారు. తెలంగాణ మార్చ్‌, వినాయక నిమజ్జనం నేపధ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉదయం నగరంలో జరిగిన టోల్‌గేట్‌ విధ్వంసం ఘటనలో బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం డీజీపీకి స్పష్టం వ్యక్తం చేశారు.