శాంతియుతంగా కవాతును నిర్వహించాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ప్రజటు భారీ ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీయాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కవాతు నిర్వహణకు అనుమతి కోరామని, ఎలాంటా హామీ పత్రాలు ఇవ్వలేదని అన్నారు. శాంతియుతంగా ఈ కవాతును నర్విహించాలన్నారు. జలవిహార్‌లో తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఉద్యోగ, ప్రజాసంఘాలతో పాటు తెరాస, బీజేపీ, సీపీఐ, న్యూడెమొక్రసీ నేతలు పాల్గొన్నారు. కవాతు నిర్వహణపై చర్చించారు. కవాతును భగ్నం చేసేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని నేతలు విమర్శించారు. జిల్లాల్లో ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ వాదులను విడుదలచేయడం లేదని ఆరోపించారు. ప్రజలు బైండోవర్‌ కేసులకు భయపడకుండా ఈ కవాతులో పాల్గొనాలని కోదండరాం కోరారు. ప్రభుత్వం జలవిహార్‌నుంచి బుద్దభవన్‌ వరకు కవాతు నిర్వహించాలని సూచించిందని, తాము పీపుల్స్‌ ప్లాజా వరకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు కోదండరాం తెలిపారు.