శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై వివిధ పక్షాల నేతలే మాట్లాడారు. అయితే లోక్‌సత్తా నేత జేపీ మాట్లాడుతుండగా తెరాస  నేత హరీష్‌రావు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మిగతా తెరాస సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను ఆరగంటపాటు వాయిదా వేశారు.