శాసనసభ గురువారానికి వాయిదా

హైదరాబాద్‌:శాసన సభ వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టిలని తెరాస సభ్యులు తమ డిమాండ్‌ను కొనసాగించారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను గురువారానికి వాయిదా వేశారు.