శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. శాసనసభ రెండు సార్లు వాయిదా పడినప్పటికీ సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించలేదు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టు నిరసన వ్యక్తం చేశారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ ఉద్యమకారుడు అని స్పీకర్‌ ప్రకటించకపోవడంతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వెలిబుచ్చారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు.