శివకుమార్‌ కాలు, చెయ్యి తొలగింపు

హైదరాబాద్‌: ఓయూ విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్‌ కాలు, చెయ్యిని వైద్యులు తొలగించారు. విద్యార్ధిని హత్య అనంతరం పుణెకు వెళ్లిన నిందితుడు శివకుమార్‌ వారం రోజుల క్రితం రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. పుణెలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఎడమకాలు, కుడిచేతిని వైద్యులు తొలగించారు.