శివాజీ పార్కుకు భారీగా తరలివస్తున్న అభిమానులు
ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన బాల్‌ధాకరే అంతిమయాత్ర మాతోశ్రీ నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. శివాజీ పార్కులో ప్రజల సందర్శనార్ధం పార్థీవదేహాన్ని ఈ సాయంత్రం వరకు ఉంచనున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు శివాజీపార్కుకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. సాయంత్రం 6గంటలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.