శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకున్న శిశు మరణాలకు వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని మంత్రుల బృందం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. తక్కువ బరువు, నెలలు నిండకుండా పుట్టటం, గర్బిణి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే శిశు మరణాలకు కారణమని వారు తెలిపారు. ఎంజిఎంలో శిశు మరణాలపై ఈరోజు సీఎం సమీక్షా సమావేశం నిరంవహించారు.