శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం:సీతంపేట ఏజెన్సీ గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది నెలలుగా జనావాసాలకు సమీపంలో సంచరిస్తున్న నాలుగు ఏనుగుల గుంపులు తాజాగా పాడలి పంచాయతీ పరిధిలోని దబ్బగూడ గ్రామంపై పడ్డాయి. సమీపంలో ఉన్న మామిడి, జీడి పంటలను ధ్వంసం చేశాయి. నిత్యం ఏనుగుల గుంపు కారణంగా అనేక కష్టాలు పడుతున్నామని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మరణాలు సంభవించిన ఘటనలూ ఉన్నాయన్నారు. ఇంతవరకూ నష్టపోయిన పంటలకు పరిహారం రాలేదని చెప్పారు. జనావాసాలకు సమీపంలో ఏనుగుల గుంపు తిరుగుతుండటంతో గిరిజనుల జాగారాలు ఉండి తమ ప్రాణాలకు రక్షించుకుంటున్నారు.