శ్రీదుర్గామల్లేశ్వరస్వామి హుండీ ఆదాయం 91.54 లక్షలు

ఇంద్రకీలాద్రి: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. 91 లక్షల 54 వేల 602 రూపాయలను కానుకల రూపంలో సమర్పించారు. వీటితో పాలు 377 గ్రాముల బంగారం, 1.77 కిలోల వెండి వస్తువులు కనుకలుగా వచ్చాయి. దేవస్థానం ఈవో రఘునాధ్‌ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.