శ్రీలంక ప్రధాన న్యాయమూర్తికి ఉద్వాసన

ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన తొలి మహిళ

కొంత కాలంగా అవినీతి ఆరోపణలు

షిరానీ బండారనాయకేకి పార్లమెంటు అభిశంసన

కొలంబొ : శ్రీలంకలో ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న తొలి మహిళ షిరానీ బండారనాయకేని ఈరోజు దేశ అధ్యక్షులు మహీంద రాజపక్ష తొలగించారు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న షిరానీని పార్లమెంటు అభిశంసించింది. ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో ఆమెను పదవినుంచి తొలగిస్తున్నట్లు అధ్యక్షులు పేర్కొన్నారు. ఆమె మీద ఆరోపించిన 14 ఆరోపణల్లో మూడింటిలో ఆమె తప్పు చేసినట్లు రుజువైందిన డిసెంబరు 8న పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.