శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు

సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు
హైదారాబాద్‌: ఓఎంసీ కేసులో నిందుతురాలు, ఐఏఎస్‌ అదికారి శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ కేసులో తాను అరెస్టయి దాదాపు 8 నెలలు కావస్తుందని… కుటుంబ బాధ్యతల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఆమె పిటీషన్‌లో అభ్యర్థించారు. సీబీఐ దర్యాప్తులో తదుపరి పురోగతి లేకపోవడం దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఐతే సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.