శ్రీలక్ష్మీకి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీకి సీబీఐ న్యాయస్థానం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. వెన్నముక చికిత్స కోసం ఆమెకు బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొన్న న్యాయస్థానం తిరిగి జనవరి 21న లొంగిపోవాలని ఆదేశించింది. తాత్కాలిక బెయిల్‌కోసం రూ. 15 వేలు పూచీకత్తు సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని, పాస్‌ పోర్టు అప్పగించాలని న్యాయస్థాణం శ్రీలక్ష్మీని ఆదేశించింది. సీబీఐ విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది.