శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి కుటుంబం సభ్యులు

తిరుమల, జూన్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రాంచరణ్‌, కోడలు ఉపాసన, డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు 40 మందికిపైగా తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం సముదాయం వద్ద వోఎస్‌డి దామో దరం, మోహన్‌బాబు, ప్రసాద్‌, చిరంజీవి కుటుంబ సభ్యులకు బస ఏర్పాటు చేశారు. విశ్రాంతి అనం తరం, శనివారం తెల్లవారు జామున శ్రీవారికి నిర్వహించే సుప్రబాత సేవలో చిరంజీవి కుటుంబ సభ్యు లు డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారి నైవేద్య విరమ సమయంలో టీటీడీ చైర్మన్‌ బాపిరాజు, కె.శ్రీనివాసరాజు, స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల చిరంజీవి ఆయన తనయుడు రాంచరణ్‌ను, ఉపాసనను చూసేందుకు కిక్కిరిసిపోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులతో పాటు, జిల్లా కాంగ్రెస్‌ అధికారులు పాల్గొన్నారు.