శ్రీశైలం ప్రాజెక్టు నీటివిడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు నీటివిడుదల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో కనీస నీటిమట్టం  834 అడుగులు ఉండేలా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. వారంలోగా ప్రాజెక్టులో నీటిమట్టం పై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.