శ్రీ శ్రీ విఘ్నేశ్వరుని పూజలో పాల్గొన్న హరి వర్ధన్ రెడ్డి
ఘట్కేసర్ ఆగస్టు 31( జనం సాక్షి)ఘట్కేసర్ మండలంలోని ఘనపూర్, లింగాపూర్ గ్రామాలలో గణనాధుని మండపాలను సందర్శించిన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
ఘట్కేసర్ మండలం,ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రాజు గౌడ్, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు వేముల అభిషేక్ గౌడ్ ల ఆహ్వానం మేరకు ఘనపూర్ గ్రామంలో మరియు ఘట్కేసర్ మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బర్ల అనిత ,వార్డు సభ్యురాలు శ్రీమతి మందుల మయూరి ఆహ్వానం మేరకు ఘనపూర్ అనుబంధ గ్రామం లింగాపూర్ లో ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్బంగా శ్రీశ్రీశ్రీ విగ్నేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ఈ రోజు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బిబ్లాక్ అధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ విచ్చేసి గణపతి పూజా కార్యక్రమం లో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో భక్తులు వినాయకుని విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించి, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆ గణనాథుడు ప్రజలందరినీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.గణపతి నవరాత్రులు జరిగే ఈ తొమ్మిది రోజులు ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో గణనాథుని పూజించి తగిన జాగ్రత్తలు తీసుకుని గణనాథుడిని నిమజ్జనం చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఈ మండపాలను ఏర్పాటు చేసిన సోదరులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలియజేశారు. ఈ
కార్యక్రమాలలో హరివర్ధన్ రెడ్డి తో పాటు ఘనపూర్ గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి ,ఉపసర్పంచ్ వేముల పరమేష్ గౌడ్ ,మాజీ సర్పంచ్ లు వేముల మమత గౌడ్,నానావత్ రూప్ సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, వార్డు సభ్యులు చిలుగురి భాస్కర్, వేముల శోభ, మండల రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు వేముల గోవర్ధన్ గౌడ్, మండల బిసి సెల్ అధ్యక్షులు బండ్లగూడెం నాగేష్ గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు గుర్జకుంట నర్సింహా,బాషగల్ల విజయ్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగుల పల్లి శ్రీనివాస్, పోచారం మున్సిపల్ బిసి సెల్ అధ్యక్షులు వరికుప్పల వెంకటేష్ , క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు బత్తుల ప్రభాకర్, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వేముల భాస్కర్ గౌడ్, వేముల పరమేష్ గౌడ్ , వేముల కేశవ నాదం గౌడ్, వేముల మహేశ్వర్ గౌడ్, రామావత్ చందర్ సింగ్ నాయక్, తాటికొండ మల్లేష్ గౌడ్, వేముల వెంకటేష్ గౌడ్ దొంకేనా బాలరాజ్ గౌడ్ , వేముల వినోద్, కట్కూరి భాను గౌడ్, వేముల శ్రీనివాస్ గౌడ్ వేముల వెంకటేశం గౌడ్, ముస్కు వెంకట్ రెడ్డి, వేముల నవీన్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.