శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇత్తడి గంట బహూకరణ
శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇత్తడి గంట బహూకరణవరంగల్ ఈస్ట్, మార్చి 27 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని రంగసాయిపేట లో గల చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సోమవారం దాతలు ఐదు కిలోల ఇత్తడి గంటను బహూకరించారు. తాము గతంలో గుడికి గంట బహూకరిస్తామని మొక్కుకున్న దానికి అనుగుణంగా గంట బహుకరించినట్లు దాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంట దాతలు గాదె శ్రీశైలం భాగ్యలక్ష్మి, హరికృష్ణ, నవ్య శ్రీ, జయ కృష్ణ, శ్రావణి లతోపాటు ఆలయ పూజారి తిరుమల శ్రీధరాచార్యులు ధర్మకర్తలు వలపదాసు కృష్ణ, షేర్ల ప్రభాకర్, సోమ అనిల్, మచ్చ కవిత తదితరులు పాల్గొన్నారు.