షామిర్ పేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : షామిర్ పేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ల లోడ్ తో వెళుతున్న వ్యాన్ బైక్ ను ఢీకొంది. గ్యాస్ సిలిండర్ల నుండి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరగడంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.