షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

లాహోర్‌: పాక్‌ నుంచచి భారత్‌కు బయలుదేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో కొన్ని గంటలపాటు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన డ్రైవర్‌ ఇంజిన్‌ని రైలు నుంచి వేరుచేశారు. రైలులోని వంద మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు స్పష్టంచేశారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు పాకిస్థాన్‌ రైల్వే మంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిటీని నియమించింది.