షిండేతో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై షిండేతో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని షిండేను మంత్రులు కోరినట్లు సమాచారం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌తో భేటీ అయ్యేందుకు తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.